Esther Noronha..!; చాలా మంది హీరోయిన్లు కమిట్మెంట్‌కు ఓకే చెప్పినవాళ్లే.. ! క్యాస్టింగ్ కౌచ్‌పై ఎస్తర్ నోరోన్హా..!
Esther Noronha..!; చాలా మంది హీరోయిన్లు కమిట్మెంట్‌కు ఓకే చెప్పినవాళ్లే.. ! క్యాస్టింగ్ కౌచ్‌పై ఎస్తర్ నోరోన్హా..!

క్యాస్టింగ్ కౌచ్‌పై నటి ఎస్తర్ నోరోన్హా చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది కచ్చితంగా ఉంటుందని, కమిట్‌మెంట్ ఇస్తేనే చాన్స్‌లు ఇస్తామని చెప్పే దర్శకనిర్మాతలు చాలా మంది ఉన్నారని తెలిపింది. తాజాగా ఎస్తర్ నటించిన సినిమా 'అమరావతికి ఆహ్వానం' చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, ఓ డిజిటల్ చానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూపలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
చాలా మంది హీరోయిన్లు పలు ఇంటర్వ్యూలలో తామేదో టాలెంట్‌తో, కష్టపడి పైకి వచ్చాను అనిచెప్తారు. దాంట్లో కొన్ని వాస్తవం ఉండొచ్చు, కొన్ని అవాస్తవాలు కూడా ఉంటాయన్నారు. ఒక్కరు కూడా తమను కమిట్‌మెంట్ అడగలేదని చెబుతారు. కానీ అదంతా అబద్దం. చాలా మంది కాంప్రమైజ్ అయినవాళ్లే. నటన రానివాళ్లు కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎలా చేస్తారు. వాళ్లకు ఉన్న లోపాలను కప్పిపుచ్చాలంటే కమిట్‌మెంట్ ఇవ్వాల్సిందే. అయితే ఎవరు అడిగారు అనేది ముందే చెప్పరు. ముందుగా కో-ఆర్డినేటర్ ద్వారా కమింట్‌మెంట్ గురించి అడిగిస్తారు. 'దానికి' ఓకే అంటే రెమ్యునరేషన్ ఇలా, లేదంటే అలా చెబుతారు. మనసైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే.. అడిగింది ఎవరనే పేరుని చెప్తారు. ముందుగానే కమిట్‌మెంట్ అడిగింది ఎవరు అని కనిపెట్టలేమన్నారు. సినిమాలలో ఎప్పుడూ సాంప్రదాయంగా చీర కట్టులో కనిపించి.. బయటికి దేవతలా కనిపించేవాళ్లు కూడా అలాంటి పనులు చేస్తారు. అయితే నేను ఏ కేటగిరీలో ఉన్నాను అనేది వారికి క్లారిటీ రావడం లేదు. కొంతమంది ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడి.. తర్వాత అలాంటి పనులు చేస్తుంటారు. నేను కూడా అలాంటి దానినే అనుకొని కాల్ చేస్తుంటారు. ఆడియన్స్ కూడా ‘ఈవిడ బాగానే మాట్లాడుతుంది, కానీ ఏదో ఒకటి చేసే ఉంటుందని‘ అనుకుంటారు. అలాంటి వాళ్లు నా ఫిల్మోగ్రఫీ చూడాలి. ఒకవేళ నేను కూడా కమిట్‌మెంట్‌కి ఓకే చెబితే.. ఇన్నేళ్లలో ఒక్క పెద్ద ప్రాజెక్టు కూడా నా దగ్గరకు రాదా? నన్ను జనం ఇంతలా ప్రేమిస్తున్నారు.. నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్‌ను ఆదరిస్తున్నారు. ఆడియన్స్, మీడియా సపోర్ట్ నాకుంది. అలాంటప్పుడు ఎందుకు నాకు అవకాశం రాలేదో ఆలోచించాలి.
ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న యువతరం అలా ఉండడం లేదన్నారు. కమిట్‌మెంట్ గురించి అడగడం లేదు. వాళ్ల చాలా ఫ్యాషన్‌తో పని చేస్తున్నారు. అలాంటి పనులు చేసేవాళ్లంతా పాత బ్యాచ్. వారందరిని నేను అంకుల్స్ బ్యాచ్ అంటాన్నారు. అంకుల్స్ కే కోరికలు ఎక్కువ ఉంటాయన్నారు. వాళ్ల ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. మనలోని లోపాలను ఆసరాగా చేసుకొని కమిట్‌మెంట్ గురించి అడుగుతారని తెలిపింది.

