Gandhi's grandson; గాంధీ విగ్రహ ఏర్పాటుపై గాంధీ మనవడు తుషార్‌ సంచలన ట్వీట్..!

గాంధీ విగ్రహ ఏర్పాటుపై గాంధీ మనవడు తుషార్‌ సంచలన ప్రకటన చేశారు. బాపూ ఘాట్‌ దగ్గర గాంధీ విగ్రహం కోసం అపార్ట్మెంట్‌ కూల్చుతామని ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ప పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అక్కడి స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ ఇళ్లు కూల్చకూడదని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ సందర్భంగా మహత్మాగాంధీ మనవడు తుషార్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్‌ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఇది కచ్చితంగా గాంధీ వ్యతిరేక చర్య అన్నారు. గాంధీ విగ్రహం కోసం భూసేకరణ నిలిపివేయాలని తుషార్ గాంధీ అన్నారు. ఇళ్ల కూల్చివేతను వెంటనే ఆపాలని, తెలంగాణ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు తుషార్ గాంధీ. గాంధీ బతికుంటే కూడా దీనిని వెంటనే ఆపాలని చెప్పేవారని తుషార్‌గాంధీ అన్నారు.

ehatv

ehatv

Next Story