Morphing photos: ఫొటోల మార్ఫింగ్‌.. న్యూడ్‌ ఫొటోలు పంపి బ్లాక్‌మెయిల్.. చివరికి ఓ వ్యక్తి..!

రాంనగర్‌లో నివాసం ఉంటున్న ప్రేమ్ కుమార్ (36) న్యూడ్ ఫోటో మార్ఫింగ్ బ్లాక్‌మెయిల్ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తుతెలియని దుండగులు అతని ఫోటలను మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫోటోలను పంపిస్తూ, వెంటనే రూ.3 వేలు చెల్లించకపోతే అతని కుటుంబ సభ్యులందరి న్యూడ్ ఫోటోలు, వీడియోలు పంపిస్తామని బెదిరించారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో బాధితుడి భార్య, కుటుంబ సభ్యులు ధైర్యం చెబుతూ, గుర్తుతెలియని వారికి డబ్బులు పంపితే మళ్లీ మళ్లీ డిమాండ్ చేస్తారని, భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేద్దామని సూచించారు. అయినప్పటికీ, నిందితుల బెదిరింపులతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన ప్రేమ్ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాళ్లు చేసే బ్లాక్‌మెయిల్‌కు భయపడకుండా వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలి. ఒక్కసారి డబ్బులు చెల్లిస్తే సమస్య తీరదు. ధైర్యంగా వ్యవహరించడమే సరైన మార్గమని పోలీసులు సూచిస్తున్నారు.

ehatv

ehatv

Next Story